ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉధృతం... రేపు రాష్ట్ర వ్యాప్తంగా....!

by Vemula.Srinu Prasad |

ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ సంస్థ ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీ నేతల చేపడుతున్న ఆందోళనలను తీవ్రతరం చేశారు. ..

ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉధృతం... రేపు రాష్ట్ర వ్యాప్తంగా....!
X

దిశ,వెబ్ డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ సంస్థ ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీ నేతల చేపడుతున్న ఆందోళనలను తీవ్రతరం చేశారు. ఆర్టీసీ మనుగడను, ఉద్యోగుల భద్రతను కాపాడుకోవడమే లక్ష్యంగా నిరసనలు కొనసాగిస్తున్నారు. విద్యుత్ బస్సులనుప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నడపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోపెట్టేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని, సంస్థ ఆధ్వర్యంలోనే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నడపాలని డిమాండ్ చేయనున్నారు. కలెక్టర్ల ద్వారా ఈ వినతిపత్రాలను సీఎం చంద్రబాబుకు చేరవేయనున్నారు.

కాగా ఆర్టీసీ ప్రైవేటీకరణను విరమించుకోవాలని ఇప్పటికే భారీగా సంతకాల సేకరణ చేశారు. లీజు బస్సులు, ప్రైవేట్ ఈ-బస్సులతో ప్రజలు, ఉద్యోగులకు జరిగే నష్టాలను వివరిస్తూ పోరాటాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఉద్యమ తదుపరి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు జులై 30న ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశం కానుంది. ఈ భేటీ అనంతరం కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని పలువురు ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.

Next Story