'శ్రీవిష్ణు X రామ్ అబ్బరాజు 2' బోర్డులోకి హోమ్లీ బ్యూటీ.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |

‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

శ్రీవిష్ణు X రామ్ అబ్బరాజు 2 బోర్డులోకి హోమ్లీ బ్యూటీ.. బర్త్‌డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: ‘సామజవరగమన’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ కాగా.. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో నటి అభిరామి జాయిన్ కాబోతున్నట్లు తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు. ఈరోజు అభిరామి బర్త్‌డే కావడంతో.. ఆమెకు విషెస్ తెలుపుతూ.. ‘అద్భుతమైన ప్రతిభావంతురాలైన అభిరామి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. మీరు మా చిత్ర బృందంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది. ఇక అభిరామి 'శ్రీవిష్ణు X రామ్ అబ్బరాజు 2' బోర్డులో భాగం కాబోతున్నట్లు తెలుపుతూ పంచుకున్న పోస్టర్‌లో అభిరామి హోమ్లీ లుక్‌లో కినిపిస్తూ ఆకట్టుకుంటుంది. కాగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు.

Next Story