దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా నుంచి అప్డేట్.. క్యూట్ పోస్టర్ వైరల్

by Chukka Sudharani |

‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’.. ఇలా తెలుగు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ కొత్త సినిమా నుంచి అప్డేట్.. క్యూట్ పోస్టర్ వైరల్
X

దిశ, సినిమా: ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’.. ఇలా తెలుగు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు డైరెక్ట్‌గా మరో తెలుగు సినిమాతో రాబోతున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీని గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘చిట్టి చిట్టి చీమ’అంటూ సాగే ఈ సాంగ్ జులై 28న రాబోతున్నట్లు ప్రకటిస్తూ.. ‘కొన్ని పాటలు వినబడతాయి.. మరికొన్ని అనుభూతిని కలిగిస్తాయి.. ఈ పాట మాత్రం స్వచ్ఛమైన భావోద్వేగ ఫీల్‌ను ఇస్తుంది.. ఇంత అద్భుతమైన మెలోడీని ఇచ్చినందుకు జీవీ ప్రకాష్‌కు ధన్యవాదాలు’ అని తెలుపుతూ పోస్టర్ షేర్ చేశారు.

Next Story