పదవీ విరమణ సేవల ముగింపు కాదు

by Ratna Kumari |

జైళ్ల శాఖ అభివృద్ధికి దశాబ్దాల పాటు అంకితభావంతో, క్రమశిక్షణతో, నిజాయితీగా సేవలందించిన నలుగురు ఉద్యోగులకు జైళ్ల శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ కార్యాలయంలో సోమవారం ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

పదవీ విరమణ సేవల ముగింపు కాదు
X

దిశ, చంపాపేట్ : జైళ్ల శాఖ అభివృద్ధికి దశాబ్దాల పాటు అంకితభావంతో, క్రమశిక్షణతో, నిజాయితీగా సేవలందించిన నలుగురు ఉద్యోగులకు జైళ్ల శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ కార్యాలయంలో సోమవారం ఘనంగా పదవీ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలుకుతున్న సిబ్బందికి అధికారులు, సహచర ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలను కొనియాడారు. పదవీ విరమణ పొందిన ఎన్. విజయ్ కుమార్ (డిప్యూటీ జైలర్, కేంద్ర కారాగారం చర్లపల్లి), ఎం. సురేంద్ర బాబు (అసిస్టెంట్ డిప్యూటీ జైలర్, కేంద్ర కారాగారం చర్లపల్లి), ఎం. అశోక్ కుమార్ (అసిస్టెంట్ డిప్యూటీ జైలర్, కేంద్ర కారాగారం నిజామాబాద్), ఎం. సాయమ్మ (స్వీపర్, ప్రిజనర్స్ అగ్రికల్చరల్ కాలనీ–చర్లపల్లి)లను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డా. సౌమ్య మిశ్రా శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. ప్రభుత్వ సేవలో ప్రతి ఉద్యోగి పాత్ర ఎంతో విలువైనదని, పదవీ విరమణ పొందిన ఈ నలుగురు అధికారులు, ఉద్యోగులు తమ విధి నిర్వహణలో నిష్కళంకమైన సేవలు, కర్తవ్యనిష్ఠ, మానవీయ విలువలను చాటుతూ జైళ్ల శాఖ ప్రతిష్ఠను పెంపొందించారని ప్రశంసించారు. ఉద్యోగ జీవితం ముగిసినా సమాజానికి వారి అనుభవం, సేవా భావం మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి జైళ్ల శాఖ ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, ప్రతి నెల ఉద్యోగుల వేతనాల నుంచి సేకరించిన వెల్ఫేర్ ఫండ్ ద్వారా అందజేసిన ఆర్థిక సహాయ చెక్కులను పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డీజీపీ స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజీ ప్రిజన్స్ (అడ్మిన్) ఎన్. మురళీ బాబు, ఐజీ ప్రిజన్స్ (వెల్ఫేర్) వై. రాజేష్, డీఐజీ ఆఫ్ ప్రిజన్స్ (వరంగల్ రేంజ్) ఎం. సంపత్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మొహమ్మద్ యూసుఫ్‌తో పాటు జైళ్ల శాఖకు చెందిన సీనియర్ అధికారులు, సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భావోద్వేగపూరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సహచరులు పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సేవలను గుర్తు చేసుకుంటూ వారికి సంతోషకరమైన, ఆరోగ్యవంతమైన పదవీ విరమణ జీవితాన్ని ఆకాంక్షించారు.

Next Story