‘దిశ’ కథనానికి స్పందన

by Jakkula.Mamatha |

గత వారం ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన "ప్రారంభోత్సవాల మోడల్ మార్కెట్.. కథనం ప్రభావం చూపింది.

‘దిశ’ కథనానికి స్పందన
X

దిశ,మహాబూబాబాద్ ప్రతినిధి: గత వారం ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన "ప్రారంభోత్సవాల మోడల్ మార్కెట్.. కథనం ప్రభావం చూపింది. పట్టణ కేంద్రంలో కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన మోడల్ సమీకృత మార్కెట్ 2021 నుంచి పలుమార్లు ప్రారంభోత్సవాలు జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కాకపోవడం పై ‘దిశ’ ఘాటుగా కథనం ప్రచురించింది.

ఈ కథనానికి స్పందించిన సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడంతో మంగళవారం మార్కెట్లో కూరగాయల విక్రయాలు ప్రారంభమయ్యాయి. వ్యాపారులను సమన్వయం చేస్తూ మార్కెట్ వినియోగంలోకి వచ్చేలా మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం నిఘా ఉంచుతూ.. పరిష్కారం దిశగా వార్తలు ప్రచురించడం ద్వారా ‘దిశ’ మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుందని పలువురు అభిప్రాయపడ్డారు.

Next Story