పడుకునే ముందు నీళ్లు తాగడం.. మంచిదా? చెడ్డదా?

by Sujitha Rachapalli |

చాలా మందికి పడుకునే ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది మనకు మంచిదా చెడ్డదా.. మన శరీరానికి మంచి చేస్తుందా.. చెడు చేస్తుందా.. అనే ఆలోచన అప్పుడప్పుడు వచ్చే ఉంటుంది.

పడుకునే ముందు నీళ్లు తాగడం.. మంచిదా? చెడ్డదా?
X

దిశ, ఫీచర్స్ : చాలా మందికి పడుకునే ముందు నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇది మనకు మంచిదా చెడ్డదా.. మన శరీరానికి మంచి చేస్తుందా.. చెడు చేస్తుందా.. అనే ఆలోచన అప్పుడప్పుడు వచ్చే ఉంటుంది. నిజానికి మన శరీరంలో సుమారు 75శాతం నీరు బేస్ చేసుకునే కార్యకలాపాలు జరుగుతాయని అంటున్నారు నిపుణులు. అందుకే బాడీకి హైడ్రేషన్ ముఖ్యమని చెప్తుంటారు. కానీ రాత్రి సమయంలో కూడా అవసరమా? నీరు తాగాలా వద్దా? అనే దానిపై పూర్తి వివరణ ఇస్తున్నారు.

లాభాలు :

రాత్రి నిద్ర పోతున్నప్పుడు కూడా శరీరం కొంత నీటిని కోల్పోతుంది. ముఖ్యంగా శ్వాస, చెమట ద్వారా ఇది జరుగుతుంది. కాబట్టి చిన్న మొత్తంలో నీళ్లు తాగడం మంచిదని చెప్తున్నారు నిపుణులు. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుందని.. రక్తపోటు స్థిరంగా ఉంటుందని.. రాత్రి సమయంలో గుండె సాఫీగా పని చేస్తుందని చెబుతారు. ఇక శరీరాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతాయని.. టాక్సిన్స్ తొలగించడంలో హెల్ప్ అవుతాయని చెప్తున్నారు. అందుకే పెద్ద గ్లాసు కాకుండా చిన్న మొత్తంలో అంటే సుమారు 200-250 ml తాగడం మంచిది. అది కూడా పూర్తిగా నిద్రపోయే ముందు కాకుండా.. నిద్రకు కనీసం ఒక గంట ముందు తాగడం ఉత్తమం. ఇక వృద్ధులు, ఆరోగ్య సమస్యలు (మూత్రపిండాలు, రాత్రి మేల్కొనే సమస్య) ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

నష్టాలు :

*రాత్రి ఎక్కువగా నీరు తాగితే ఎదురయ్యే సాధారణ నష్టం రాత్రి మేల్కొనడం. టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇది స్లీప్ క్వాలిటీని తగ్గిస్తుంది.

* యాసిడ్ రిఫ్లక్స్ : కొందరికి నీళ్లు ఎక్కువ తాగడం వల్ల అజీర్ణం లేదా గుండెలో మంట వచ్చే అవకాశం ఉంటుంది.

* ఎక్కువ నీరు తాగడం వల్ల REM నిద్ర తగ్గవచ్చు అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని కారణంగా స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయ్యే అవకాశముంది.

Next Story