ఎంత దగ్గరగా వస్తే తప్పించుకోవడం అంత కష్టం.. ‘వదలా’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది

by Chukka Sudharani |

సీనియర్ నటుడు జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’.

ఎంత దగ్గరగా వస్తే తప్పించుకోవడం అంత కష్టం.. ‘వదలా’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘వదలా’. అకెళ్ల వి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులై 17న ప్రపంవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై హైప్ పెంచే పనిలో పడిన మూవీ టీమ్.. వదలా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పలు అప్డేట్స్ ఆకట్టుకోగా.. ఇటీవల టీజర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించారు. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే దంపతుల చుట్టూ తిరిగే కథ ఇది. అయితే.. అనుహ్యంగా వారి కుటుంబానికి దగ్గరగా ఉండే ఓ యువతి ఆ దంపతుల్లో భర్తపై వ్యామోహం పెంచుకుంటుంది. అతడిని దక్కించుకునేందుకు ఎంత దూరమైన వెళ్లడానికి సిద్ధపడుతుంది. ఈ ముక్కోణపు ప్రేమకథలో ఉత్కంఠభరితమైన అంశాలతో వచ్చిన టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యగా.. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘అది ఎంత దగ్గరగా వస్తుందో... తప్పించుకోవడం అంత కష్టం. 'వదలా' ప్రపంచంలోకి అడుగుపెట్టండి.. ట్రైలర్ జులై 9న ఉదయం 11 గంటలకు విడుదల కానుంది’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు.

Next Story