'దిశ' పత్రిక కథనానికి స్పందన.. ప్రభుత్వ భూముల వ్యవహారంపై అదనపు కలెక్టర్ సీరియస్

by Jakkula.Mamatha |

జిల్లా పరిధిలోని బాచుపల్లి మండలం నిజాంపేట్, బాచుపల్లి గ్రామాల్లోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ అధికారుల అలసత్వం, కబ్జాదారుల అక్రమాలపై 'దిశ' దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది.

దిశ పత్రిక కథనానికి స్పందన.. ప్రభుత్వ భూముల వ్యవహారంపై అదనపు కలెక్టర్ సీరియస్
X

దిశ, మేడ్చల్ బ్యూరో: జిల్లా పరిధిలోని బాచుపల్లి మండలం నిజాంపేట్, బాచుపల్లి గ్రామాల్లోని వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ అధికారుల అలసత్వం, కబ్జాదారుల అక్రమాలపై 'దిశ' దిన పత్రికలో సోమవారం ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగంలో తీవ్ర సంచలనం సృష్టించింది. "రెవెన్యూ అధికారుల అలసత్వం.. కబ్జాదారులకు వరం" శీర్షికన ప్రచురితమైన ఈ ప్రత్యేక కథనానికి జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. ప్రభుత్వ భూములను కాపాడటంలో నిర్లక్ష్యం వహించిన అధికారుల తీరుపై జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నిజాంపేట్ సర్వే నెంబర్లు 325, 233లో కోర్టు కేసుల వ్యవహారం, అలాగే బాచుపల్లి సర్వే నెంబర్ 454లో చెరువు కట్ట బఫర్ జోన్ ఆక్రమణలపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా మల్కాజ్గిరి ఆర్డీవో శ్యామ్ ప్రసాద్‌ను ఆయన ఆదేశించారు.

కదిలిన యంత్రాంగం.. విచారణకు ఆదేశం

కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు సంబంధించి హైకోర్టులో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేయడంలో జరిగిన ఆలస్యం, అధికారుల లోపాయికారి ఒప్పందాల ఆరోపణలపై పూర్తి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించినట్లు తెలిసింది. రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ, కోర్టుల్లో సరైన కౌంటర్లు వేయకపోవడానికి గల కారణాలను, బాధ్యులైన అధికారుల పాత్రను లీగల్ టీంతో కలిసి పరిశీలించనున్నారు.

'ఆకృతి' ఆక్రమణలపై నాజర్

బాచుపల్లి సర్వే నెం. 454 లో ప్రభుత్వ భూమితో పాటు చెరువు కట్ట బఫర్ జోన్‌ను ఆక్రమించి అక్రమంగా రహదారి ఏర్పాటు చేసిన 'ఆకృతి కన్స్ట్రక్షన్' వ్యవహారంపై కూడా క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఒకవేళ ఆక్రమణలు నిజమని తేలితే, 'హైడ్రా' లేదా స్థానిక అధికారుల సహాయంతో వాటిని తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల రక్షణలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. కోర్టు కేసుల విషయంలో ఎక్కడ లోపం జరిగిందో గుర్తించి, తక్షణమే అప్పీల్ పిటిషన్లు దాఖలు చేస్తాం. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తప్పవు అని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదనప కలెక్టర్ విజయేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story