- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెడ్ శారీలో చూపు తిప్పుకోనివ్వని అందాలతో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్
హాట్ అందాలతో అలరిస్తున్న ఆషికా రంగనాథ్.

దిశ, వెబ్ డెస్క్: అందాల ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కన్నడ చిత్రాల ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ భామ తన అందం, అభినయంతో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది. 1996 ఆగస్టు 5న కర్ణాటకలోని తుమకూరులో జన్మించిన ఆషికా, 2016లో విడుదలైన కన్నడ చిత్రం 'క్రేజీ బాయ్'తో వెండితెరకు పరిచయమైంది.
ఆ తర్వాత వరుస అవకాశాలతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లిన ఈ బ్యూటీ, 2023లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'అమిగోస్' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం 'నా సామి రంగ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను అందుకుని తన ఖాతాలో తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'విశ్వంభర' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఆషికా రంగనాథ్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన గ్లామరస్ ఫోటోషూట్లను అభిమానులతో పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోల్లో గోల్డ్ అంచు కలిగిన రెడ్ కలర్ శారీని ధరించిన ఆషికా, హెవీ ఎంబ్రాయిడరీ వర్క్‌తో డిజైన్ చేసిన గోల్డ్ కలర్ బ్లౌజ్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది. మెడలో భారీ హారం, చేతికి బ్రేస్‌లెట్, చెవులకు అందమైన ఇయర్‌రింగ్స్ ధరించి, చిన్న బొట్టుతో తన లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకుంది.
జుట్టును అందంగా వెనక్కి వదిలి చిరునవ్వుతో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. ముఖ్యంగా ఈ ఫోటోల్లో ఆషికా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు ఆమె అందంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Photos Courtesy: Instagram






