ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట

by Jakkula.Mamatha |

ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన తప్పనిసరిగా ఉపాధిహామీ జాబ్ కార్డు ఉండాల్సిందే అనే నిబంధన రావడంతో మండలంలో ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్య పెరిగింది.

ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ  ఇళ్ల లబ్ధిదారులకు ఊరట
X

దిశ, ఏన్కూర్: ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన తప్పనిసరిగా ఉపాధిహామీ జాబ్ కార్డు ఉండాల్సిందే అనే నిబంధన రావడంతో మండలంలో ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్య పెరిగింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి ఇల్లు నిర్మించుకునేందుకు మంజూరు చేయడంతో.. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఉపాధి హామీ పనిలో భాగంగా 90 రోజులు మాస్టర్ వేసేందుకు అవకాశం కలిగింది. ఒకవైపు ఇల్లు నిర్మించుకుంటూ, మరొకవైపు ఉపాధి పనికి వెళ్లాలంటే కష్టతరంగా ఉండటంతో.. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఊరట కలిగే విధంగా తమ సొంత ఇంట్లోనే పనులు చేసుకునేందుకు 90 రోజులు అవకాశం కల్పించింది. ప్రస్తుతం మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో వ్యవసాయ సీజన్ మొదలైనప్పటికీ సుమారు 2000 మంది కూలీలు హాజరవుతున్నట్లు సమాచారం.

Next Story