- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూవీ సెట్‌లో ప్రమాదం.. కార్మికుడు మృతి.. దర్శకుడు 50 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్
మృతుడి కుటుంబానికి రూ.40 పరిహారం సరిపోదని.. దాన్ని రూ.50 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ అండ్ వార్’. సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టా్త్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే జూన్ 17న తెల్లవారుజామున ముంబై ఫిల్మ్ సిటీలోని రాయల్ పంప్ స్టూడియోలో జరిగిన ప్రమాదంలో షూటింగ్ పనుల్లో పాల్గొంటున్న 42 ఏళ్ల వడ్రంగి చంద్రధరి సింగ్ యాదవ్ కరెంట్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో ఆలియా భట్ కూడా సెట్‌లోనూ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఇక ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా.. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటన తర్వాత నిర్మాణ సంస్థపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో.. పరిహారంగా రూ.40లక్ష వరకు బాధిత కుటుంబానికి ఇచ్చినట్లు సమాచారం. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కుటుంబానికి ఏకైక జీవనాధారమైన వ్యక్తి మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఈ సంఘటనలోకి ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లాయీస్(FWICE) రంగంలోకి దిగింది. మృతుడి కుటుంబానికి రూ.40 పరిహారం సరిపోదని.. దాన్ని రూ.50 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఆయన పిల్లల చదువును దృష్టిలో పెట్టుకుని మరింత ఆర్థిక భరోసా కల్పించాలని FWICE కోరుతోంది. ఇక ఈ విషయంపై ఫెడరేషన్ అధ్యక్షుడు బీఎస్ తివారీ మాట్లాడుతూ.. బాధితులకు ఆర్థిక సహాయం ఇవ్వడమే కాకుండా సినిమా షూటింగ్ సెట్‌లో ఇలాంటి ప్రమాదాలు మరోసారి జరగకుండా చూసుకోవాలని సూచించారు.






