- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు పంకజ్ త్రిపాఠి సోదరుడిపై మారణాయుధాలతో దాడి.. పరిస్థితి అత్యంత విషమం
బీహార్ గోపాల్‌గంజ్‌లో భూవివాదం నేపథ్యంలో బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి అన్నయ్య బిజేంద్ర నాథ్ తివారీపై లాఠీలతో దాడి జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి (Pankaj Tripathi) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగిన ఓ భూవివాదంలో పంకజ్ త్రిపాఠి పెద్దన్నయ్య బిజేంద్ర నాథ్ తివారీ (Bijendra Nath Tiwari)పై ప్రత్యర్థులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి తెగబడగా ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. మాధోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్సంద్ గ్రామంలో బిజేంద్ర నాథ్ తివారీకి స్థానికంగా కొందరితో చాలాకాలంగా భూమికి సంబంధించిన పాత తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాత్రి కొందరు వ్యక్తులు గ్రామంలో మాటువేసి, ఆయన ఒంటరిగా ఉన్న సమయం చూసి ఒక్కసారిగా లాఠీలు, పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావమై ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
పరిస్థితి విషమం.. పాట్నాకు తరలింపు
తీవ్రంగా గాయపడిన బిజేంద్ర నాథ్ తివారీని కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక మోడల్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు, ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను వెంటనే రాజధాని పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో బిజేంద్ర తివారీకి అత్యవసర చికిత్స అందుతోంది. అయితే, ఫిర్యాదు ఆధారంగా దాడికి పాల్పడిన నిందితులలో ఒకరిని ఇప్పటికే గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, నిందితుడిని జుడీషియల్ కస్టడీకి పంపుతున్నట్లుగా ఎస్పీ వినయ్ తివారీ (SP Vinay Tiwari) పేర్కొన్నారు.






