- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ టు ఏలూరు.. తల్లి మందలించిందని ఇల్లు విడిచిన అక్కాచెల్లెళ్ల గుర్తింపు
by Ramesh Naini |
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల కథ సుఖాంతమైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల కథ సుఖాంతమైంది. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడుతున్నారని తల్లి మందలించడంతో అలిగిన ఆ ముగ్గురు బాలికలు ఇంటి నుంచి వెళ్లిపోయారు. కంగారు పడిన తల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసిన ఫలక్‌నుమా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు సోమవారం ఆ ముగ్గురు బాలికలు ఏపీలోని ఏలూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారిని సురక్షితంగా తిరిగి హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫోన్ వాడకంపై చిన్నపాటి మందలింపుకే పిల్లలు ఇల్లు వదిలి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
Next Story






