- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రేమను చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నా.. ఇకపై ప్రేక్షకులను అస్సలు నిరాశపరచను: స్వాసిక
నా జీవితంలో, కలలో కూడా ఇంతటి గొప్ప ప్రశంసలు, ఆదరణ లభిస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ స్వాసిక హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇక ఇటీవల సూర్య హీరోగా వచ్చిన ‘కరుప్పు’లో లాయర్‌గా చేసిన స్వాసిక బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే విజయ్ ఆంటోనీ సరసన ‘నూరు సామి’.సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లోకి వచ్చి విమర్శకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన నటి స్వాసికపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా, ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. తమిళ ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ లైవ్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియోలో శ్వాసిక మాట్లాడుతూ.. "నా జీవితంలో, కలలో కూడా ఇంతటి గొప్ప ప్రశంసలు, ఆదరణ లభిస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు.
అభిమానులు ప్రేమను చూసి కన్నీళ్లు ఆపులకోలేకపోతున్నాను. ఒక సినిమాను నా భుజాలపై వేసుకుని నడిపించినందుకు, దానికి ప్రేక్షకుల నుంచి ఇంతటి అపారమైన ప్రేమ దక్కడం నాకు ఒక కలలా అనిపిస్తోంది" అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇదే క్రమంలో తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తమిళ ప్రేక్షకులు నాపై చూపించిన ఈ పూర్తి స్థాయి ఆదరణ ఇప్పుడు నాకు ఆక్సిజన్‌లా మారింది. నా రాబోయే సినిమాల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ప్రేక్షకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచకుండా, సమాజం పట్ల మరింత బాధ్యతాయుతమైన పాత్రలనే ఎంచుకుంటాను" అని స్వాసిక స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ‘నూరుసామి’చిత్రంతో ఆమె ఓవర్ స్టార్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.






