రాజీతో సమస్యను పరిష్కరించుకోండి : కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

by Batti.Sumithra |

ఈ నెల 20న నిర్వహించనున్న రెండవ జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.

రాజీతో సమస్యను పరిష్కరించుకోండి : కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : ఈ నెల 20న నిర్వహించనున్న రెండవ జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ జాతీయ మెగా లోక్ ఆదాలత్ సంబందించి వరంగల్ కమిషనరేట్ పోలీసులు రూపొందించిన వాల్ పోస్టర్లను వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఈ నెల 20 న రెండవ జాతీయ మెగా లోక్ అదాలత్ ఉన్నందున రాజీ పడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసుల్లో కక్షిదారులు రాజీ పడే అవకాశం ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారాయణ, పరకాల ఇన్స్ స్పెక్టర్ క్రాంతి కుమార్, దామెర ఎస్.ఐ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story