- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tata Motors: సాఫ్ట్‌వేర్‌తో నడిచే కార్ల యుగానికి టాటా సిద్ధం
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కారులోని సాఫ్ట్‌వేర్‌ను హార్డ్‌వేర్ నుంచి వేరు చేసి, అవసరమైనప్పుడు ఇంటర్నెట్ ద్వారా కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లు అందించే సామర్థ్యాన్ని కల్పించనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భవిష్యత్తు కార్లను కేవలం ఇంజిన్‌లు, హార్డ్‌వేర్ ఆధారంగా కాకుండా సాఫ్ట్‌వేర్ ఆధారంగా రూపొందించే దిశగా ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం కంపెనీ సొంతంగా ‘టీ.ఐడల్' ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేస్తోంది. సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్స్ (ఎస్‌డీవీ)గా వీటిని పరిగణించనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కారులోని సాఫ్ట్‌వేర్‌ను హార్డ్‌వేర్ నుంచి వేరు చేసి, అవసరమైనప్పుడు ఇంటర్నెట్ ద్వారా కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లు అందించే సామర్థ్యాన్ని కల్పించనుంది. కనెక్టివిటీ, ఇన్ఫోటైన్‌మెంట్, భద్రత, డ్రైవర్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు భవిష్యత్తులో మరింత సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తాయని కంపెనీ చెబుతోంది. దీనికోసం ఎన్విడియాతో కలిసి ఏఐ ఆధారిత డ్రైవర్ అసిస్టెన్స్, ఆటోమేటెడ్ డ్రైవింగ్, స్మార్ట్ పార్కింగ్, ప్రయాణికుల పర్యవేక్షణ వంటి అధునాతన టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం కంపెనీ 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే ఆర్అండ్‌డీపై రూ.2,836 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టింది. భవిష్యత్తు సాంకేతికతకు నిదర్శనగా సరికొత్త 'సియెర్రా' కారును టాటా మోటార్స్ సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై సిద్ధం చేసింది.
ఈ సరికొత్త సాఫ్ట్‌వేర్ విప్లవం వల్ల కస్టమర్లకు లభించే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే కార్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా 'ఓవర్-ది-ఎయిర్' అప్‌డేట్‌ల ద్వారా సరికొత్త ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లను తమ వాహనాల్లో సులభంగా పొందవచ్చు. కనెక్టివిటీ, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ నుంచి వాహన భద్రత వరకు అన్నీ సాఫ్ట్‌వేర్ ఆధారంగానే అప్‌డేట్ అవుతాయి. ఈ టెక్నాలజీ రోడ్‌మ్యాప్‌తో పాటు, టాటా మోటార్స్ తన 'మల్టీ-పవర్‌ట్రెయిన్' వ్యూహాన్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈవీ మార్కెట్లో 40.2 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉన్న టాటా.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 1,70,000 సీఎన్‌జీ వాహనాలను, 92,000 ఈవీలను విక్రయించి రికార్డు సృష్టించింది. సరికొత్త కార్ల లైనప్, పటిష్టమైన టెక్నాలజీ, పెరుగుతున్న ఎస్‌యూవీ, సీఎన్‌జీ, ఈవీ డిమాండ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.






