- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రెయిన్ స్ట్రోక్ ముప్పును తగ్గించే పరికరం.. అల్ట్రాసౌండ్ హెల్మెట్!
శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన వోర్టెక్స్ మెడికల్ హెల్మెట్‌ను ధరించినప్పుడు అందులో సుడిగాలిలా మెలితిరుగుతూ ఉండే అల్ట్రాసౌండ్ తరంగాలు తలబలోపలి భాగంలోకి వెళ్తాయి.

దిశ, ఫీచర్స్ : బ్రెయిన్ స్ట్రోక్ ప్రాణాంతకమైందనే విషయం తెలిసిందే. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, చికిత్సలో ఆలస్యమైనా ప్రాణాలకు ముప్పు తప్పదు. అయితే ఈ చికిత్సను మరింత సులభతరం చేసేలా ఒక అద్భుతమైన సాంకేతిక పరికరం ఆవిష్కతమైంది. వాస్తవానికి రక్తం గడ్డకట్టడమే ఈ సమస్యకు ప్రధాన కారణం కాబట్టి, వాటిని వేగంగా కరిగించే ‘వోర్టెక్స్ అల్ట్రాసౌండ్ మెడికల్ హెల్మెట్’ను డెవలప్ చేశారు యూఎస్‌లోని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు. స్ట్రోక్ అటాక్ చేసినప్పుడు ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా, బ్రెయిన్‌లో బ్లడ్‌ను వేగంగా రీస్టోర్ చేయడంలో ఈ డివైజ్ సహాయపడుతుందని చెబుతున్నారు.
క్లాట్‌ను కరిగిస్తుంది
శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన వోర్టెక్స్ మెడికల్ హెల్మెట్‌ను ధరించినప్పుడు అందులో సుడిగాలిలా మెలితిరుగుతూ ఉండే అల్ట్రాసౌండ్ తరంగాలు తలబలోపలి భాగంలోకి వెళ్తాయి. అక్కడ మెదడుకు సరఫరా అయ్యే రక్త నాళాల్లో క్లాట్ అయిన గడ్డలపై ఒత్తిడిని కలిగించి, వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ‘సోనోథ్రాంబోలిసిస్’ అంటారు. ప్రస్తుతం ఉన్న సాధారణ చికిత్స పద్ధతుల కంటే ఇది 64% వేగంగా గడ్డకట్టిన బ్లడ్‌ను కరిగిస్తుందని ఈ పరికరాన్ని డెవలప్ చేసిన నిపుణులు అంటున్నారు.
ఎలా పనిచేస్తుంది?
హెల్మెట్ నుంచి వెలువడే అల్ట్రాసౌండ్ తరంగాలు సోనోథ్రాంబోలిసిస్ ప్రాసెస్ ద్వారా నేరుగా రక్తం గడ్డ కట్టిన భాగాన్ని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంలో చిన్న మైక్రోబబుల్స్‌ను గడ్డకట్టిన భాగంపైకి పంపిస్తాయి. అల్ట్రాసౌండ్ తరంగాలు ఈ బబుల్స్‌ను తాకగానే అవి వేగంగా కదలుతూ గడ్డకట్టిన రక్తాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. బాడీలోకి ఎలాంటి పరికరం పంపకుండానే ప్రక్రియ పూర్తవుతుంది. పాత పద్ధతుల ద్వారా గడ్డను కరిగించడానికి పట్టే సమయం కంటే ఈ వోర్టెక్స్ పద్ధతి ద్వారా 40% సమయం ఆదా అవుతుందని ల్యాబ్ పరిశోధనల్లో తేలింది. ప్రస్తుతం ఈ అల్రాసౌండ్ మెడికల్ హెల్మెట్ ప్రయోగం చివరి దశలో ఉంది. ఇప్పటికే జంతువులపై విజయవంతమైంది. త్వరలో మానవులకు సైతం అందుబాటులోకి రానున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.






