- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Wipro: ఏఐ రేసులో వేగం పెంచిన విప్రో
బెంగళూరులోని ఇన్నోవేషన్ హబ్‌లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్, విప్రో కొత్త ఏఐ-నేటివ్ బిజినెస్ అండ్ ప్లాట్‌ఫామ్స్ యూనిట్‌లో కీలక భాగంగా పనిచేయనుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం విప్రో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తన వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తూ, ఆంత్రోపిక్ సహకారంతో క్లాడ్ ఏఐ మోడల్స్ కోసం ప్రత్యేక ‘అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (సీఓఈ)ను ప్రారంభించింది. బెంగళూరులోని ఇన్నోవేషన్ హబ్‌లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్, విప్రో కొత్త ఏఐ-నేటివ్ బిజినెస్ అండ్ ప్లాట్‌ఫామ్స్ యూనిట్‌లో కీలక భాగంగా పనిచేయనుంది. బ్యాంకింగ్, ఆరోగ్య సంరక్షణ, విమానయాన, తయారీ, వినియోగదారుల రంగాల్లో ఏఐ ఆధారిత కొత్త ఉత్పత్తులు, సేవల అభివృద్ధిని వేగవంతం చేయడమే దీని లక్ష్యం. క్లాడ్ ఏఐ మోడల్స్‌ను విప్రో ఇప్పటికే తన ఫైనాన్స్, హెచ్‌ఆర్, సేల్స్ వంటి అంతర్గత కార్యకలాపాల్లో వినియోగిస్తుండగా, ఇప్పుడు వాటిని క్లయింట్ల వ్యాపార ప్రక్రియల్లో కూడా విస్తృతంగా అమలు చేయాలని యోచిస్తోంది.
ఇందులో భాగంగా రాబోయే 18 నెలల్లో 10,000 మంది ఫ్రంట్‌లైన్ ప్రొఫెషనల్స్‌కు క్లాడ్ ఏఐ మోడల్స్‌పై ప్రత్యేక శిక్షణ, సర్టిఫికేషన్ ఇవ్వనుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ‘ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్లు’ అనే ప్రత్యేక ఏఐ ప్రొఫెషనల్స్ బృందాన్ని రూపొందిస్తోంది. వీరు నేరుగా క్లయింట్ల సంస్థల్లో పనిచేస్తూ, ఏఐ టెక్నాలజీని వ్యాపార కార్యకలాపాల్లో వేగంగా అమలు చేయడంలో సహకరిస్తారు. ఏఐని కేవలం ప్రయోగాత్మక టెక్నాలజీగా కాకుండా, వ్యాపార ఫలితాలను అందించే సాధనంగా మార్చడమే తమ లక్ష్యమని విప్రో సీఈఓ శ్రీని పల్లియా తెలిపారు. ఏఐ ఆధారిత సేవలు, కన్సల్టింగ్ సామర్థ్యాల కలయికతో సంస్థ తదుపరి వృద్ధి దశను లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ స్పష్టం చేసింది.






