పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి పై కేసు నమోదు..

by Kodari Anjali |

పోలీసులతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన కథలాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తి పై కేసు నమోదు..
X

దిశ, కథలాపూర్: పోలీసులతో అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన కథలాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక మండల ఎస్ ఐ. రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గొడవ జరుగుతున్నట్లు 100 డయాల్ కు అందిన సమాచారం మేరకు బ్లూ కోల్ట్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దినేష్, శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని గొడవ పడుతున్న శంభోజీ పవన్ కుమార్ అనే వ్యక్తిని ఎందుకు గొడవ పడుతున్నారని విచారణ చేపట్టే సమయంలో ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండి కానిస్టేబుల్ దినేష్‌, శ్రీనివాస్ లతో వాగ్వాదం చేస్తూ, వారిని నెట్టివేసి, పోలీసు విధులకు ఆటంకం కలిగించగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి మంగళవారం శంభోజి పవన్‌ కుమార్‌ను అరెస్టు చేసి, అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచ్చినట్లు ఎస్ ఐ. రవికిరణ్ తెలిపారు. కాగా కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. ఈ సంఘటనపై ఎస్‌ఐ రవికిరణ్ మాట్లాడుతూ.. మండలంలోని ప్రజలు చట్టాలను గౌరవిస్తూ, పోలీసు వారికి సహకరించాలని అదేవిధంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, పోలీసు విధులకు ఆటంకం కలిగించిన ఉపేక్షించేది లేదని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు.

Next Story