- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద ఉద్రిక్తత
ఇసుక లారీల మితిమీరిన రాకపోకలతో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయంటూ బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన రైతులు,స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ,బూర్గంపాడు జూన్ : ఇసుక లారీల మితిమీరిన రాకపోకలతో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయంటూ బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన రైతులు,స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోంపల్లి ఇసుక ర్యాంపు మార్గంలో ప్రయాణిస్తున్న ఇసుక లారీలను గ్రామస్థులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అడ్డుకున్నారు.
రోడ్లన్నీ గుంతలమయం : వ్యవసాయ పనులకు ఆటంకం
ప్రస్తుతం వ్యవసాయ సాగు సీజన్ కావడంతో రైతులు తమ పొలాలకు ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ పరికరాలు,విత్తనాలు, ఎరువులు,పురుగు మందులను తరలించాల్సి వస్తోంది. అయితే,ఇసుక లారీలు రయ్.. రయ్ మంటూ నిరంతరం ఇటుగా రాకపోకలు సాగించడంతో రోడ్లన్నీ భారీ గుంతలుగా మారి, పూర్తిగా అధ్వాన్నంగా తయారయ్యాయని స్థానికులు ఆరోపించారు.దీనివల్ల తాము పొలాలకు వెళ్లలేక,వ్యవసాయ పనులు సకాలంలో చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దారి మార్చకుంటే ఇసుక రవాణా నిలిపివేస్తాం!
ఇసుక ర్యాంపు నిర్వాహకులు వెంటనే స్పందించి,తమ రవాణా మార్గాన్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రతిసారీ లారీలను ఇలాగే అడ్డుకుంటామని, ఇసుక రవాణాను సాగనివ్వబోమని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో బూర్గంపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు,యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






