- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చంపేట వైద్య సేవలో పనితీరు ప్రక్షాళన దిశగా చర్యలు..
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వంగపడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరు ప్రక్షాళన దిశగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట వంగపడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పనితీరు ప్రక్షాళన దిశగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.. మంగళవారం ఆస్పత్రిలో అన్ని విభాగాల వైద్య సిబ్బందితో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నేల 25 నుండి నాలుగో విడత మెగా సర్జికల్ క్యాంపు విజయవంతం చేసేందుకు అందరు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ఏరియా హాస్పిటల్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీ ఆసుపత్రుల వైద్య సేవలను మరింత మెరుగుపరచే లక్ష్యంతో డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలతో సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది పనితీరు, మౌలిక సదుపాయాలు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల అందింపుపై సమగ్రంగా సమీక్షించారు.
ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత..
ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువ కావాలని, ప్రతి రోగికి సత్వర మరియు మెరుగైన వైద్యం అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొంటూ, వైద్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువ కావాలని, ప్రతి రోగికి సత్వర మరియు మెరుగైన వైద్యం అందేలా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాసులు, డిసిహెచ్ఎస్ డా.రామకృష్ణ, డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ తార సింగ్, డాక్టరులు మహేష్, ప్రతిప్ రాజ్ , బిక్కు నాయక్, ఇతర డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.






