- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అధికారుల తనిఖీలు..
బోధన్ పట్టణంలోని పలు ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, రెస్టారెంట్లలో ఆహార భద్రతాధికారి మంగళవారం తనిఖీలు నిర్వహించారు.

దిశ, బోధన్: బోధన్ పట్టణంలోని పలు ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు, రెస్టారెంట్లలో ఆహార భద్రతాధికారి మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలకు సంబంధించిన పలు లోపాలను అధికారి గుర్తించినట్లు తెలిపారు. కొన్ని సంస్థల్లో సింథటిక్ ఆహార రంగులు, టేస్టింగ్ సాల్ట్ (ఎంఎస్‌జీ) వినియోగం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించబడిందన్నారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచినట్లు అధికారుల తనిఖీల్లో గుర్తించారు. ఈ విషయంలో సంబంధిత ఆహార వ్యాపార నిర్వాహకులకు మెరుగుదల నోటీసులు జారీ చేయబడతాయని ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 నియమాలు, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తగిన జరిమానాలు కూడా విధించబడతాయన్నారు. అన్ని ఆహార వ్యాపార నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, నిర్దేశిత పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రమాణాలను నిర్వహించాలని అధికారి సూచించారు.






