పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ అర్వింద్..

by Kodari Anjali |

నిజామాబాద్ నగరంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంపీ అర్వింద్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి సందర్శించారు.

పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని సందర్శించిన ఎంపీ అర్వింద్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని మంగళవారం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తాతో కలిసి సందర్శించారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రంలోని అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. కేంద్రంలో దరఖాస్తు దారులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. పాస్ పోర్ట్ కోసం సేవా కేంద్రానికి వచ్చిన దరఖాస్తుదారులతో కూడా ఎంపీ మాట్లాడారు. కేంద్రంలో దరఖాస్తుదారులకు అందుతున్న సేవల గురించి, కేంద్రంలోని సౌకర్యాల గురించి అసౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారిణి స్నేహజ జొన్నలగడ్డతో కూడా వోల్ఫ్ ద్వారా సంభాషించారు. దేశంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు తమ సేవలను వేగవంతం చేయడమే కాకుండా పాస్ పోర్టు పొందేందుకు, సేవలను సులభతరం చేశాయన్నారు. సాధారణ దరఖాస్తుదారులకు వారం రోజుల్లో, తత్కాల్ దరఖాస్తుదారులకు మూడు రోజుల్లో పాస్‌పోర్ట్‌లు అందుతున్నాయి. ఈ సమర్థవంతమైన సేవల కోసం అధికారులు, సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు.

Next Story