- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాన్యుడి చేతిలో ఓటు వజ్రాయుధం: మునుగోడు ఎమ్మెల్యే
ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసుకోవాలన్న, సమర్థవంతమైన నాయకులని ఎన్నుకోవాలన్న ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

దిశ, మునుగోడు: ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసుకోవాలన్న, సమర్థవంతమైన నాయకులని ఎన్నుకోవాలన్న ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఈనెల 25 నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై డిసిసి అధ్యక్షుడు పున్న కైలాస్ నేత అధ్యక్షతన జరిగిన మునుగోడు నియోజకవర్గ వ్యాప్త బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధులు మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గంలో ఓటు విలువ పెరిగిందని, ఇతర ప్రాంతాలలో కంటే మునుగోడులోనే ఓటు ఉంచుకోవాలనే ఒక బ్రాండ్ క్రియేట్ అయిందన్నారు. ప్రతి ఒక్కరికి ఆ ఓటు హక్కు ఉండేలా క్షేత్రస్థాయిలో బిఎల్ఎలు బాధ్యతగా పని చేయాలన్నారు. బిఎల్ఏలు క్షేత్రస్థాయిలో చేయాల్సిన పనులపై పిసిసి సర్ ప్రక్రియపై నియమించిన మాస్టర్ ట్రైనర్ నుమాన్ వివరించారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్లు, మ్యాపింగ్ అయిన ఓటర్లు, అన్ మ్యాపింగ్ అయిన ఓటర్లు ఓటు తొలగించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే వారికి సూచనలు, ఇతర ప్రాంతాల్లో ఓటు ఉండి ఇక్కడ ఓటు ఉన్నప్పటికీ వారి విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియలో పలు అంశాలపై సందేహాలను బిఎల్ఎలు మాస్టర్ ట్రైనర్ నూమన్ ని అడుగగా అడిగిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేశారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా వన్ మ్యాపింగ్ ఓట్లతో కలుపుకొని మార్పులు చేర్పులు తప్పులు ఉన్న ఓటర్ల సంఖ్య 91 వేల వరకు ఉన్నదని దీనిని బిఎల్ఎలు సీరియస్ గా తీసుకొని ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగించకుండా పనిచేయాలని ఎఐసిసి కో-ఆర్డినేటర్ రుద్ర సంతోష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బిఎల్ఏలతోపాటు మున్సిపాలిటీల చైర్మన్లు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






