నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి: ఎన్ఎస్‌యూఐ

by Ramesh Naini |

జూన్ 21న నిర్వహించనున్న నీట్ యూజీ –2026 రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎన్ఎస్‌యూఐ ప్రభుత్వాన్ని కోరింది.

నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి: ఎన్ఎస్‌యూఐ
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూన్ 21న నిర్వహించనున్న నీట్ యూజీ –2026 రీ-ఎగ్జామ్‌కు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎన్ఎస్‌యూఐ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకట్ స్వామి మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్ స్వామి మాట్లాడుతూ, పరీక్ష మళ్లీ నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు అదనపు రవాణా ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల పరీక్ష రోజున విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు.

ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ జాతీయ లీగల్ సెల్ కోఆర్డినేటర్ అక్బర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాకేష్, హస్సన్, విష్ణువర్ధన్, వికాస్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story