- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India: ఎయిర్ ఇండియా కొత్త ‘బేసిక్ ఫేర్’
తక్కువ ధరలో ప్రయాణించాలనుకునే, అదనపు సౌకర్యాల కంటే టికెట్ ధరకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ధరల పోటీ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన ప్రయాణాల్లో కొత్త ‘బేసిక్ ఫేర్’ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఈ టికెట్‌లో ఉచిత భోజనం ఉండదు. తక్కువ ధరలో ప్రయాణించాలనుకునే, అదనపు సౌకర్యాల కంటే టికెట్ ధరకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫేర్‌ను కొన్ని ఎంపిక చేసిన దేశీయ రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. అయితే ప్రయాణికులకు ఇప్పటికే ఉన్న వాల్యూ, క్లాసిక్, ఫ్లెక్స్ ఫేర్ కేటగిరీలు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో ఉచిత మీల్స్‌తో పాటు అదనపు ప్రయోజనాలు కొనసాగుతాయి. కొత్త బేసిక్ ఫేర్‌లో 15 కిలోల చెక్డ్ బ్యాగేజ్, 7 కిలోల క్యాబిన్ బ్యాగేజ్ అనుమతి, అలాగే టీ లేదా కాఫీ వంటివి ఉచిత సేవలు లభిస్తాయి. అయితే భోజనం మాత్రం అందించరు. తక్కువ ఖర్చుతో ప్రయాణించాలనుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పైలట్ దశలో ఉన్న ఈ పథకానికి ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి భవిష్యత్తులో దీన్ని మరిన్ని మార్గాలకు విస్తరించాలా, లేదా కొనసాగించాలా అనే అంశంపై ఎయిర్ ఇండియా నిర్ణయం తీసుకోనుంది. ఖర్చులను నియంత్రిస్తూ, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సేవలను అందించాలనే కంపెనీ వ్యూహంలో ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.






