రణబాలిలో కరువు రాక్షసుడు ఆర్నాల్డ్...రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా ?

by velandi.Saikiran |   (  Updated:2026-06-16 15:10:42  IST  )

'రణబాలి'తో భారతీయ చలనచిత్ర రంగంలోకి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ అడుగుపెడుతున్నారు.

రణబాలిలో కరువు రాక్షసుడు ఆర్నాల్డ్...రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలుసా ?
X

దిశ‌, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రణబాలి'. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. 19వ శతాబ్దపు బ్రిటిష్ వలస పాలన కాలం నాటి యదార్ధ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో సంభవించిన తీవ్ర కరువు, బ్రిటిష్ వారి అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడి కథనే ఈ 'రణబాలి'.

ఈ మూవీలో వీరోచిత యోధుడిగా విజయ్ దేవరకొండ కనిపించనుండగా, రష్మిక జయమ్మ అనే పవర్ ఫుల్ రోల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. హాలీవుడ్ క్లాసిక్ ది మమ్మీ సినిమాలో విలన్ గా భయపెట్టిన ఆర్నాల్డ్ వోస్లూ (ArnoldVosloo) ఈ మూవీలో భ‌యంక‌ర‌మైన‌ విలన్ పాత్రలో కనిపించనున్నారు. సర్ థియేడర్ హెక్టర్ పాత్రలో ఆయన మెరుగునున్నారు. ఆర్నాల్డ్ వోస్లూ పుట్టిన రోజు నేపథ్యంలో మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోకి ఆయనకు స్వాగతం పలికారు. కాగా ఈ సినిమాలో ఆర్నాల్డ్ వోస్లూకి విజ‌య్ తో స‌మానంగా రెమ్యూన‌రేష‌న్ ఇస్తున్న‌ట్లు టాక్‌. దాదాపు రూ.30 వ‌ర‌కు ఆర్నాల్డ్ వోస్లూకు ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

Next Story