ఎంఎంసి క‌మిష‌న‌ర్ వర్షాకాల సన్నద్ధత పనుల పరిశీలన‌

by Kodari Anjali |

స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ముంద‌స్తు చ‌ర్య‌లు వేగ‌వంతంగా చేయాల‌ని మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ విన‌య్ కృష్ణా రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

ఎంఎంసి క‌మిష‌న‌ర్ వర్షాకాల సన్నద్ధత పనుల పరిశీలన‌
X

దిశ, మేడ్చల్ బ్యూరో: స‌మ‌స్యాత్మ‌క ప్రాంతాల్లో ముంద‌స్తు చ‌ర్య‌లు వేగ‌వంతంగా చేయాల‌ని మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ విన‌య్ కృష్ణా రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం రామంతాపూర్ మోడ్ర‌న్ బేక‌రీ, దేవేంద‌ర్ న‌గ‌ర్ రోడ్డు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బందితో క‌లిసి కమిషనర్ ప‌ర్య‌టించారు. రామంతాపూర్ రోడ్ మోడ్ర‌న్ బేక‌రీ స‌మీపంలో వ‌ర్షం ప‌డితే నీరు నిల్వ ఉండే ప్రాంతాల‌ను కమిషనర్ పరిశీలించారు. భారీ వర్షాల సమయంలో నీరు నిల్వ కాకుండా చేపడుతున్న చర్యలు, ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ వ్యవస్థ పనితీరు, వర్షపు నీటి పారుదల పరిస్థితులను అధికారులు వివరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే రామంతాపూర్ దేవేందర్ నగర్ రోడ్ వెంట ఉన్న ప్రధాన నాలాను కమిషనర్ పరిశీలించారు. నాలా నీటి ప్రవాహ సామర్థ్యం, కొనసాగుతున్న నిర్వహణ పనుల పురోగతి, వర్షపు నీటి పారుదల పరిస్థితులను సమీక్షించారు. వర్షాకాలంలో ఎలాంటి అవరోధాలు లేకుండా నీటి ప్రవాహం కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలో వరద ముప్పును తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు.ఈ తనిఖీలలో ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా, ఎంఎంసీ చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, ఎంఎంసి - హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఈడీ పంకజ, ఉప్పల్ జోన్ హైడ్రా ఎస్ ఎఫ్ ఓ మోహన్ రావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Next Story