7540 బ్యాట‌రీ, రేర్ కెమెరాల‌తో వ‌చ్చేసిన రెడ్మీ..ధ‌ర‌, పీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

7540 బ్యాట‌రీ, రేర్ కెమెరాల‌తో రెడ్మీ లాంఛ్ అయింది.

7540 బ్యాట‌రీ, రేర్ కెమెరాల‌తో వ‌చ్చేసిన రెడ్మీ..ధ‌ర‌, పీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్: రెడ్ మీ నుంచి మరో సరికొత్త మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది. రెడ్ మీ టర్బో 5 (Redmi Turbo 5) పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేశారు. ప్రీమియం మిడ్ రేంజ్ వాళ్ల కోసం ఈ మొబైల్ తీసుకువచ్చారు. పర్ఫామెన్స్, బిల్డ్ క్వాలిటీ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ Redmi Turbo 5 బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పెంచారు. ఇక ఇందులో 8GB + 256GB వేరియంట్ ఫోన్ ధ‌ర రూ.37,999గా ఫిక్స్ చేశారు. 12GB + 256GB వేరియంట్ ఫోన్ ధ‌ర రూ. 40,999గా ఫైన‌ల్ చేశారు.

రెడ్ మీ టర్బో 5 ఫోన్ ఫీచ‌ర్స్ ఒక‌సారి ప‌రిశీలిస్తే, 6.59 అంగుళాల డిస్ ప్లే అందిస్తున్నారు. MediaTek Dimensity 8500గా ఉండ‌నుంది. 50MP (Main) + 8MP (UW) రేర్ కెమెరాల‌ను అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 20MP Front Camera అందిస్తోంది కంపెనీ. 7540mAh Battery ఉండ‌నుంది. 100W (Wired) + 27W ఛార్జ‌ర్ మాత్ర‌మే స‌పోర్ట్ చేయ‌నుంది. Android 16 , HyperOS 3 వెర్ష‌న్ అందిస్తున్నారు.

Next Story