అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ పీఈసెట్ ఫలితాలు విడుదల

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ పీఈసెట్ (AP PECET) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి.

అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఏపీ పీఈసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శారీరక విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (AP PECET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఫలితాలను ఇవాళ సాయంత్రం అధికారికంగా విడుదల చేశారు. బీపీఈడీ (B.P.Ed), డీపీఈడీ (D.P.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది పీఈసెట్ పరీక్షల్లో రికార్డు స్థాయిలో 89.76 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లుగా ప్రకటించారు. పరీక్ష రాసిన అభ్యర్థుల్లో అత్యధిక శాతం మంది అర్హత సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేస్తామని, విద్యార్థులు తమ ర్యాంక్ కార్డ్స్, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

Next Story