పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-26 10:36:56  IST  )

దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి.

పరేడ్‌ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సికింద్రాబాద్‌ (Secunderabad)లోని పరేడ్‌ గ్రౌండ్‌ (Parade Ground)లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు అట్టహాసంగా సాగాయి. రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ (Governor Jishnudev Varma) ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పతాకావిష్కరణ అనంతరం గవర్నర్ సాయుధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ బలగాలు, ఎన్‌సీసీ కేడెట్లు నిర్వహించిన మార్చ్‌ పాస్ట్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎ మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ శివధర్‌రెడ్డి, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అమరవీరుల స్మారకం వద్ద ప్రముఖులు నివాళులర్పించారు.

READ MORE .....

‘రైజింగ్ తెలంగాణ-2047’‌లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నాం.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక వ్యాఖ్యలు

Next Story