- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుంగతుర్తి మీదుగా హన్మకొండకు బస్సు నడపండి.. వినతిపత్రం అందజేత
by Jakkula.Mamatha |
సూర్యాపేట-తుంగతుర్తి-తొర్రూరు- హనుమకొండ ప్రాంతాల మీదుగా బస్సు సర్వీసును నడిపించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ కోతి రాములు గౌడ్ ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేశారు.

X
దిశ,తుంగతుర్తి: సూర్యాపేట-తుంగతుర్తి-తొర్రూరు- హనుమకొండ ప్రాంతాల మీదుగా బస్సు సర్వీసును నడిపించాలని కోరుతూ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ కోతి రాములు గౌడ్ ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం తొర్రూరు డిపో ఆర్టీసీ అధికారులను కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. తొర్రూరు డిపో నుంచి ఉదయం బయలుదేరి జలాల్ పురం-గొట్టిపర్తి-తుంగతుర్తి- వెలుగుపల్లి ప్రాంతాల మీదుగా సూర్యాపేటకు బస్సు వెళ్లి తిరిగి ఇదే మార్గాల గుండా హనుమకొండ వరకు నడపాలని కోరారు. ఈ బస్సు సర్వీస్ వల్ల సూర్యాపేట, జనగాం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలోని దాదాపు 30 గ్రాముల ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా గతంలో ఈ సర్వీసు నడిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Next Story






