- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గొర్రెను చంపిందని చిరుతకు విషం.. కళేబరం లభ్యం
by Jakkula.Mamatha |
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి అటవీ రేంజ్ పరిధిలోని భీంగల్ మండలం తాళ్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం లభ్యమైంది.

X
దిశ,భీంగల్: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి అటవీ రేంజ్ పరిధిలోని భీంగల్ మండలం తాళ్లపల్లి అటవీ ప్రాంతంలో చిరుతపులి కళేబరం లభ్యమైంది. గొర్రెను చంపిందనే ఆగ్రహంతో ఓ గొర్రెల కాపరి విషం పెట్టి చిరుతను చంపినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టి, చిరుత కళేబరాన్ని అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టినట్లు గుర్తించారు. అనంతరం పూడ్చిన ప్రాంతాన్ని తవ్వి చిరుత అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గొర్రెల కాపరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Next Story






