- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్ లాంచ్‌కు రంగం సిద్ధం
జూలై 13న ఆర్కే సినీమాక్స్‌లో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రోజురోజుకూ పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు. జూలై 13న హైదరాబాద్‌లోని ఆర్కే సినీమాక్స్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర బృందం పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి శశాంక్ యేలేటి కథ, దర్శకత్వం వహించగా, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. టీజర్ లాంచ్ ఈవెంట్‌కు అభిమానులు ఉచితంగా హాజరయ్యేలా YouWeMedia.com ద్వారా ఫ్రీ పాస్‌లు అందుబాటులో ఉంచినట్లు మేకర్స్ వెల్లడించారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






