- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రివిక్రమ్ కోసం తన బ్రాస్‌లైట్‌ను కుదవ పెట్టిన గౌతమ్ రాజు.. పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు
త్రివిక్రమ్ కు గౌతమ్ రాజు తన బ్రాస్‌లైట్ కుదవ పెట్టి రూ.1,000 సహాయం చేశారని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా, నటుడిగా, కథా రచయితగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వారిలో పోసాని కృష్ణమురళి ఒకరు. ఆయన వద్ద శిష్యరికం చేసిన వారిలో ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర దర్శకులుగా కొనసాగుతున్న పలువురు ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ ప్రయాణం ప్రారంభ రోజులకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పోసాని మాట్లాడుతూ.. "త్రివిక్రమ్ శ్రీనివాస్ సినీ రంగంలోకి రాకముందే నా దగ్గర పని చేయాలని ఎంతో ఆసక్తి చూపేవాడు.
అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేశాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు, 'సార్.. మీ దగ్గర పని చేయాలని ఒక అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు. ఆయనకు సమయం వృథా చేసుకోవద్దని చెప్పండి' అని నాతో అన్నారు. కానీ ఆయన ఎవరో నాకు తెలియకపోవడంతో ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ గౌతమ్ రాజు, 'త్రివిక్రమ్ నాకు బాగా తెలుసు. అతను చాలా పేద కుటుంబానికి చెందినవాడు. మా పిల్లలకు ట్యూషన్ కూడా చెబుతుంటాడు' అని చెప్పారు.
అప్పుడు నేను, 'అతను మంచివాడేనా?' అని అడిగితే, 'చాలా మంచివాడు' అని గౌతమ్ రాజు సమాధానం ఇచ్చారు. వెంటనే అతడిని మద్రాస్‌కు తీసుకురమ్మని చెప్పాను. అయితే త్రివిక్రమ్ వద్ద మద్రాస్ వెళ్లేందుకు కూడా డబ్బులు లేవు. అలాంటి పరిస్థితిలో గౌతమ్ రాజు తన చేతికి ఉన్న బ్రాస్‌లైట్ ను దాదాపు రూ.1,000కు కుదవ పెట్టి ఆ డబ్బుతో త్రివిక్రమ్‌ను మద్రాస్‌కు తీసుకొచ్చాడని పోసాని వెల్లడించారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం టాలీవుడ్‌లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా విజయవంతమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.






