ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడుతున్న బస్సులు

by Gantepaka Srikanth |   (  Updated:2026-07-12 08:25:15  IST  )

విజయవాడలోని ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.

ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో తగలబడుతున్న బస్సులు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని ఆటోనగర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక మెకానిక్ షెడ్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. షెడ్డులో మంటలు క్షణాల్లోనే వ్యాపించడంతో, అక్కడ మరమ్మతుల కోసం నిలిపి ఉంచిన ఏడు ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద తీవ్రతకు ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. ఏం జరుగుతుందో తెలియక, ప్రాణభయంతో స్థానికులు, వాహనదారులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, జరిగిన ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

షార్ట్ సర్క్యూటే కారణమా..?

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, బ్యాటరీ టెర్మినల్స్ వద్ద లేదా షెడ్డులోని వైరింగ్‌లో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story