- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాత పద్ధతిలోనే రైతులకు యూరియా అందజేయాలి.. వినతిపత్రం అందజేత
by Jakkula.Mamatha |
రైతులకు ఇబ్బందికరంగా ఉన్న యూరియా యాప్‌ను తక్షణమే రద్దుచేసి, పాత పద్ధతులో రైతులకు యూరియా అందజేయాలని కోరుతూ ఏన్కూర్ మండల సిపిఐ కార్యదర్శి, జాగర్లమూడి రంజిత్ కుమార్ తహసీల్దార్ శేషగిరిరావు వినతి పత్రం అందజేశారు.

X
దిశ, ఏన్కూర్: రైతులకు ఇబ్బందికరంగా ఉన్న యూరియా యాప్‌ను తక్షణమే రద్దుచేసి, పాత పద్ధతులో రైతులకు యూరియా అందజేయాలని కోరుతూ ఏన్కూర్ మండల సిపిఐ కార్యదర్శి, జాగర్లమూడి రంజిత్ కుమార్ తహసీల్దార్ శేషగిరిరావు వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ మొదలవుతున్న తరుణంలో, రైతులకు సాగు చేయడం భారంగా మారిందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్షత చూపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రంజిత్ కుమార్ ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్‌ని ప్రోత్సహించే అందుకే యూరియా యాప్ ని ప్రవేశపెట్టడం జరిగిందని, తక్షణమే యాప్ ను రద్దు చేసి రైతులకు యూరియా అందజేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాళ్లూరు రమణయ్య, మాదినేని రమేష్ తదితరులున్నారు.
Next Story






