- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రుద్రారంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం
కొడంగల్ మండలంలోని రుద్రారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులు పెండ్డ ఏళ్లప్ప మరియు బుక్క ముక్తార్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఈరోజు ఘనంగా ప్రారంభించారు.

దిశ, కొడంగల్: కొడంగల్ మండలంలోని రుద్రారం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులు పెండ్డ ఏళ్లప్ప మరియు బుక్క ముక్తార్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందరం ప్రశాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ్ గృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేస్తూ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ గృహాల పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మందికి ప్రయోజనం చేకూరుస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సంజీవ్ రెడ్డి, కొడంగల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఏళ్లప్ప, ఉపసర్పంచ్ గోపాల్ రెడ్డి, వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ సాయిలు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సంజనోళ్ల నరేష్, నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.






