To -Letలో కుల సంస్కృతి

by Muthe.Rajitha |

ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లో పురోగతి ఆడిస్తుంటే మన దేశం కుల పిచ్చిలో పోటీ పడుతోంది.

To -Letలో కుల సంస్కృతి
X

ప్రపంచం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోంది, ప్రపంచ దేశాల మధ్య అభివృద్ధి లో పోటీ సాగుతుంది, ప్రపంచం మొత్తం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లో పురోగతి ఆడిస్తుంటే మన దేశం కుల పిచ్చిలో పోటీ పడుతోంది, ఆధునిక కాలంలో కూడా అనేక చోట్ల కుల దురహంకారాలు కొనసాగుతూనే ఉంటాయి.

వేల సంవత్సరాల క్రితం వేద కాలపు వర్ణ వ్యవస్థలో కుల వివక్ష ఉండేది, వీటి పైన అనేక సంఘసంస్కర్తలు ఉద్యమించి కొంత అవగాహన తీసుకువచ్చాక సమాజంలో కొంత మార్పు వచ్చింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ రచన కమిటీ ఏర్పడింది, ఈ రాజ్యాంగ కమిటీ దేశంలో ఉన్న ప్రజలందరూ సమానమనీ, ఎలాంటి కుల మత లింగ ధనిక పేద వివక్ష ఉండరాదు ఆని తెలియజేస్తూ రాజ్యాంగాన్ని రూపొందించింది,

కులం ఆధారంగా అద్దె ఇళ్లా?

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు గడిచినా దేశంలో కుల వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది, గతంలో నగరాల్లో కానీ పట్టణంలో కానీ రూముల అద్దె కోసం వేళితే అన్ని వివరాలు చెప్పిన తర్వాత, మీ పేరేంటి మీరు ఏం పని చేస్తారూ మీది ఎక్కడ అంటూ ప్రశ్నలు సంధిస్తూ కులాన్ని వెతికేవారు, అయినా స్పష్టత రాకపోతే మీరు ఏ కులం అంటూ అడిగేవారు. పలాన కులం అనగానే మొహం మీదే నిరాకరించే వారు. గతంలో సమాజంలో అవగాహన లేక అసమానతలు, కుల వివక్షలు కొనసాగాయి అనుకుంటే, నేటి తరంలో కూడా కులం ఆధారంగా రూములు అద్దె ఇవ్వటం చూస్తుంటే భారత దేశం ఎటు పోతోంది అని విచారమేస్తుంది, టూ లెట్‌లో కుల సంస్కృతి ఈ మధ్య మళ్ళీ దర్శనిస్తోంది.

నో ఎస్సీ, నో ఏస్టీ...

పట్టణంలో ఒక యజమాని టూ లేట్ బోర్డ్ పెట్టటమే కాకుండా దాంట్లో పలాన మతం, కులం వారికి మాత్రమే అంటూ పేర్కొనటం విడ్డూరం, దాంట్లో హిందువులు మాత్రమే అని అనటం హిందువులలో నో ఎస్సీ, ఏస్టీ అని పెట్టటం ఎంత దుర్మార్గం, ఇది ఒక వర్గం వారిని అవమానించటమే. ఎస్సీ ఎస్టీలు హిందూ మతంలో భాగమే. ఇళ్లు హిందూ మతం వారికే అన్నప్పుడు వీళ్లూ హిందువులే కదా అద్దెకు ఎందుకు నిరాకరిస్తున్నారు నో ఎస్సీ, ఏస్టీ అని పెట్టటం అంటే వారు హిందువులు కారు అనటమే అవుతుంది. దీన్ని బట్టి దేశంలో ఇంకా కుల వివక్ష అనేది పెరుగుతుందే తప్ప తగ్గడంలేదు అని స్పష్టంగా కనిపిస్తుంది, ఇంటి యజమానికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, కానీ బావ ప్రకటన స్వేచ్ఛ (ఆర్టికల్ 19(1)a ) అనేది హద్దు మీరకూడదు కదా.

మనల్ని మనమే అవమానించుకుంటూ..

రాజ్యాంగం ఏం చెబుతోంది అంటే కుల జాతి వివక్షలను వ్యక్తపరచడం నేరంగా భావిస్తుంది, ఇలా బహిరంగంగా ఎస్సీ ఎస్టీలకు ఇవ్వం అని వ్యక్తపరచడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీలు ఇక్కడ పుట్టి పెరిగిన భారతీయ హిందువులే కదా, ఎక్కడో వేరే దేశంలో ఉన్న హిందువుల పైన దాడిని ఖండిస్తూ సానుభూతి తెలియజేసే వారు, ఈ దేశ ఎస్సీ ఎస్టీ హిందువుల పైన కుల వివక్ష చూపించడం సమంజసమా మన తోటి వారిని మనమే అవమానించుకుంటూ మళ్లీ వేద కాలంలోకి వెళ్దామా!

అందరం ఒకటేనా?

ఇలా వివక్షలు కొనసాగుతూ ఉంటే దేశం ఎలా పురోగతి సాధిస్తుంది? ఎలాంటి వివక్షలు లేని సమాజాన్ని నిర్మించడంలో అందరూ భాగస్వాములు అవ్వాలి, అందరూ సమానమనే అవగాహనతో ఇలాంటి కుల ఆధారిత వివక్షలను అరికట్టాలి. అందరం ఒకటే అనే భావన కలగాలి.

K. వెంకటేష్

జర్నలిజం 2వ సంవత్సరం విద్యార్ధి

SPTU

Next Story