- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూసఫ్‌గూడలో ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు
హైదరాబాద్ లో ఫుట్ పాత్‌లు, పేవ్మెంట్లపై ఉన్న ఆక్రమణల తొలగింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ జీహెచ్ఎంసీతో పాటు ట్రాఫిక్ పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దిశ, జూబ్లీహిల్స్: హైదరాబాద్ లో ఫుట్ పాత్‌లు, పేవ్మెంట్లపై ఉన్న ఆక్రమణల తొలగింపు చర్యలను ముమ్మరం చేయాలంటూ జీహెచ్ఎంసీతో పాటు ట్రాఫిక్ పోలీస్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒకసారి తొలగించాక మళ్లీ ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అలాగే చాలా ఏళ్లుగా జిహెచ్ఎంసి యూసఫ్ గూడ సర్కిల్-38 పరిధిలోని కృష్ణకాంత్ పార్క్ నుండి వెంగళరావు నగర్ , జె. జె ఆసుపత్రి వరకు రోడ్డు పై ఫుట్ పాత్ లు ఆక్రమణలు జరిగి వాహనాల రాకపోకలకు, పాదచారులకు ప్రమాదకరంగా ఈ రోడ్డు సమస్యగా ఉండేదని అటు ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ యూసఫ్‌గూడ సర్కిల్-38 డిప్యూటీ కమిషనర్ సురేష్, అలాగే ఏసిపి రమేష్ ఆధ్వర్యంలో ఫుట్ పాత్‌లను ఆక్రమించిన షాప్‌ల ఆక్రమణలను అధికారులు తొలగించారు. దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగించారు. తొలగించిన ఆక్రమణలు స్థలంలో మళ్ళీ పునరుద్ధరణ చేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ డీ.సి సురేష్ , ఏసిపి రమేష్, టౌన్ ప్లానింగ్ అధికారులు, డి.ఈ , శానిటేషన్ అధికారులు పాల్గొన్నారు.






