నిర్లక్ష్యానికి పరాకాష్ట.. రోడ్ల పై బారికేడ్లు, డ్రమ్ములు తొలగింపు

by Batti.Sumithra |

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ట్రాపిక్ క్రమబద్ధీకరణకు, రోడ్ల పై భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు, హెచ్చరిక డ్రమ్ములను తొలగించడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది.

నిర్లక్ష్యానికి పరాకాష్ట.. రోడ్ల పై బారికేడ్లు, డ్రమ్ములు తొలగింపు
X

దిశ, కల్వకుర్తి : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ట్రాపిక్ క్రమబద్ధీకరణకు, రోడ్ల పై భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు, హెచ్చరిక డ్రమ్ములను తొలగించడం నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. కల్వకుర్తి పట్టణంలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పట్టణ పోలీసులు కీలకమైన ప్రాంతాల్లో బారికేడ్లు, డ్రమ్ములను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ, భద్రతా చర్యల కోసం ఉపయోగిస్తారని తెలిసి కూడా పట్టణ ప్రజలు వాటిని పక్కకు నెట్టి వాహనాలను రోడ్ క్రాస్ చేస్తున్నారు. జడ్చర్ల - కోదాడ జాతీయ రహదారి కల్వకుర్తి పట్టణ మద్య నుంచి వెళుతుంది. పలు జిల్లాలకు, రాష్ట్రాలకు ఈ దారి కావడంతో 24 గంటలు ట్రాపిక్ తో భారీ వాహనాలతో రాకపోకలు కొనసాగుతుంటాయి. అదే క్రమంలో పట్టణ రోడ్లను మళ్ళించడానికి హైవే పై 8 దారులను డివైడ్ చేశారు.

ఇందులో ముఖ్యంగా నాగర్ కర్నూల్, పాలమూర్, హైదరాబాద్ చౌరస్తాలు కాగా మిగితా క్రాస్ రోడ్డు ఆయా కాలనీల కోసమై వినియోగించేటట్టు సంభందిత శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. హై వే కావడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవించి కొంతమంది మృత్యువాతకు గురికాగా, క్షతగాత్రులైన వారి సంఖ్య ఎక్కువైంది. దీనిని దృష్టిలో పెట్టుకొన్న పోలీసులు ప్రజా భద్రత దృష్ట్యా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ తిలక్ నగర్ రోడ్డు వైపు వెళ్ళే దారి, సిల్వర్ జూబ్లీ క్లబ్ ముందర బారికేడ్లను, డ్రమ్ములను ఏర్పాటు చేస్తే వాటిని తొలగించారు. 2 నిమిషాల్లో రోడ్డు క్రాస్ చేసేందుకు కొంత దూరంలో ఉన్న దారిని వదిలి ప్రమాదాలకు సంకేతంగా ఉన్న అదే దారిలో ప్రాణాలను పణంగా పెడుతూ వాహనాలను క్రాస్ చేస్తున్నారు. వారి ప్రాణాలే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలో నెట్టుతున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో కనిపెట్టి మరిన్ని బారికేడ్లు, డ్రమ్ములు, రేడియం ట్రాఫిక్ లైతే వినియోగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖ అధికారులు దీనిపై ద్రుష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని పట్టణ మేధావులు కోరుకుంటున్నారు.

Next Story