నెల రోజుల గడువుతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తెచ్చిన రిలయన్స్ జియో!

by Disha Web Desk 19 |
నెల రోజుల గడువుతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తెచ్చిన రిలయన్స్ జియో!
X

న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. మొదటిసారిగా ప్రీపెయిడ్‌ సబ్‌స్క్రైబర్‌ల రీఛార్జ్ ప్లాన్ కాలపరిమితి(వాలిడిటీ) నెల రోజులు కలిగిన రూ. 259 కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ను ప్రీపెయిడ్ వినియోగదారులు నెలకొకసారి మాత్రమే చేసుకోవచ్చు. భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కంపెనీలకు వ్యాలిడిటీని 28 రోజుల నుంచి 30 రోజుల కాలపరిమితితో నెలవారీగా మార్చాలని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జియో నెలరోజుల మొదటి ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది.

ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్ లభిస్తాయి. అలాగే, వ్యాలిడిటీ నెల రోజులకు(నెలలో 30 లేదా 31 రోజులతో సంబంధం లేకుండా) వర్తిస్తుంది. దీనివల్ల సబ్‌స్క్రైబర్లు ఒక ఏడాదిలో 12 రీఛార్జ్‌లు మాత్రమే చేసుకోవచ్చు. అలాగే, ఇతర జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే రూ. 259 ప్లాన్‌ను ఒకేసారి అనేక సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ రీఛార్జ్ చేసిన ప్లాన్, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లాన్ గడువు ముగిసిన తర్వాతే యాక్టివేట్ అవుతుంది. ప్లాన్ ఇప్పటికే ఆన్‌లైన్ సహా ఆఫ్‌లైన్ ద్వారా రీఛార్జ్ చేసుకునేందుకు అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో టెలికాం కంపెనీలను ట్రాయ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లకు సంబంధించి నెల రోజుల గడువుతో ఉండే ప్లాన్‌లను తీసుకురావాలని సూచించింది.


Next Story

Most Viewed