- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వార్తల విశ్వసనీయతే మా బలం - ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
'ఆపరేషన్ సింధూర్' అనుభవాల ద్వారా సమాచార నిర్వహణలో (narrative management) తాము అనేక కీలక పాఠాలు నేర్చుకున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: 'ఆపరేషన్ సింధూర్' అనుభవాల ద్వారా సమాచార నిర్వహణలో (narrative management) తాము అనేక కీలక పాఠాలు నేర్చుకున్నామని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. దీర్ఘకాలంలో విజయం సాధించాలంటే ఇచ్చే సమాచారంలో విశ్వసనీయత, స్థిరత్వం ఉండటం అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. సమాచార వ్యాప్తిలో ఎక్కడ శూన్యత (vacuum) ఏర్పడకూడదని, ఒకవేళ అలా జరిగితే ఆ ఖాళీని ప్రతికూల వార్తలు (negative news) వేగంగా ఆక్రమిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టేందుకు ఏప్రిల్ 22 నుంచే పశ్చిమ సరిహద్దుకు సంబంధించిన ఆర్మీ ట్విట్టర్ ఖాతాలన్నింటినీ నిలిపివేశామని జనరల్ ద్వివేది వెల్లడించారు. వివిధ కమాండ్ల నుంచి వచ్చే సమాచారం వల్ల గందరగోళం ఏర్పడకుండా, కేవలం 'ఏడీజీ స్ట్రాట్‌కామ్' (ADG StratCom) నుంచే అధికారిక సమాచారం వెలువడేలా 'సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్' విధానాన్ని పాటించామన్నారు. ఈ వ్యూహం వల్లే ఆపరేషన్ సమయంలో ఆర్మీ వెల్లడించిన విషయాలకు అత్యంత విశ్వసనీయత లభించిందని ఆయన వివరించారు.






