depression: డిప్రెషన్‌ను న్యాచురల్‌గా తగ్గించండిలా..?

by Kodari Anjali |

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌లో డిప్రెషన్ ఒకటి.

depression: డిప్రెషన్‌ను న్యాచురల్‌గా తగ్గించండిలా..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌లో డిప్రెషన్(Depression) ఒకటి. చిరాకు, దీర్ఘకాలికంగా తలనొప్పి(headache) రావడం, జీర్ణ సమస్యలు(Digestive problems) తలెత్తడం, శక్తి లేకపోవడం, తొందరగా అలసిపోవడం, రాత్రి వేళల్లో నిద్ర పట్టకపోవడం లేదా ఎక్కువ సమయం పాటు నిద్రపోవడం, ఇతరులతో మాట్లాడకపోవడం, పలు కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, అన్ని పనులపై ఆసక్తి కోల్పోవడం వంటి లక్షణాలు డిప్రెషన్‌కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ స్ట్రెస్(Stress) వల్ల కూడా డిప్రెషన్‌కు లోనవుతారు. కాగా డిప్రెషన్‌ను మందులతో కాకుండా న్యాచురల్‌గా తగ్గించుకోవాలంటే నిపుణులు చెప్పిన విధంగా చేయండి. డిప్రెషన్‌కు చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా యోగా చేయాలి. ప్రతిరోజూ మార్నింగ్ వాకింగ్(Morning walk) చేయాలి. తర్వాత మెల్లిమెల్లిగా వ్యాయామాలు చేయడం ప్రారంభించాలి. ప్రశాంతమైన వాతావరణంలో ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. జాగింగ్(Jogging), వాకింగ్(walking), స్మిమ్మింగ్(Skimming), యోగా(Yoga) వల్ల డిప్రెషన్ ‌నుంచి బయటకు రావొచ్చు.

ఎప్పుడైనా సరే పాజిటివ్ ‌గా ఆలోచించాలి. విజయాలను నెమరువేసుకోవాలి. ఒక్కసారిగా డిప్రెషన్ కు లోనైతే.. ఏ పని చేయడానికి ముందడుగు వేయాలనిపించదు. కాగా గతంలో సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తు చేసుకోవాలి. ఎక్కువగా మీ మనసుకు నచ్చిన సాంగ్స్ వినండి. అలాగే పుస్తకాలు చదవండి. ఏదైనా పనిలో నిమఘ్నమైతే.. ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామో ఆ బాధ నుంచి బయటపడుతారు. అలాగే నాణ్యమైన ఫుడ్ తీసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి,డి ఆహారంలో భాగం చేసుకోవాలి. మిమ్మల్ని మీర హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి వాటర్ ఎక్కువగా తాగాలి.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులను సంప్రదించగలరు.

Next Story