Redmi నుంచి Note 11 Pro.. ఫీచర్స్ ఇవే

by Disha Web Desk 17 |
Redmi నుంచి Note 11 Pro.. ఫీచర్స్ ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: చైనీస్ దిగ్గజ స్మార్ట్ ఫోన్ Redmi Note సిరీస్‌లో మరోకొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. Redmi Note 11, Note 11 Pro+ 5G ఫోన్‌లను విడుదలచేసింది. ఈ ఫోన్‌లు తక్కువ ధరలో వినియోగదారులకు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. Redmi ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 67W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీలతో రన్ అవుతాయి.

Redmi Note 11 ప్రో స్పెసిఫికేషన్స్

Redmi Note 11 Pro ఆండ్రాయిడ్ 11 పై కంపెనీ MIUI 13 స్కిన్‌తో రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డాట్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 nits పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఇది MediaTek Helio G96 SoC ద్వారా, 8GB RAMతో పనిచేస్తుంది.

స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 108 MP Samsung HM2 ప్రైమరీ సెన్సార్, 8 MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2 MP మాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సార్‌ ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Redmi Note 11 Pro 6GB + 128GB స్టోరేజ్ మోడల్‌ ధర రూ. 17,999. 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999. స్మార్ట్‌ఫోన్ ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ, స్టెల్త్ బ్లాక్ కలర్స్‌లలో లభిస్తుంది. Redmi Note 11 Pro మార్చి 23 మధ్యాహ్నం 12 గంటల నుండి Amazon, Mi.com, Reliance Digital, రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.





Redmi Note 11 Pro+ 5G స్పెసిఫికేషన్స్

Redmi Note 11 Pro+ 5G Android 11 పై MIUI 13 తో నడుస్తుంది. Redmi Note 11 Pro వలె స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల పూర్తి-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 nits పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ద్వారా, 8GB RAM తో పనిచేస్తుంది.

ఫోన్ వెనుక భాగంలో 108-మెగాపిక్సెల్ Samsung HM2 ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఉంది.

Redmi Note 11 Pro+ 5G , 6GB + 128GB స్టోరేజ్ ధర రూ. 20,999. 8GB + 128GB ధర రూ. 22,999. 8GB + 256GB రూ. 24,999. Redmi Note 11 Pro+ 5G మిరాజ్ బ్లూ, ఫాంటమ్ వైట్, స్టెల్త్ బ్లాక్ కలర్స్‌లలో లభిస్తుంది. Redmi Note 11 Pro+ 5G మార్చి 15న మధ్యాహ్నం 12 గంటల నుండి Amazon, Mi.com, Reliance Digital, రిటైల్ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.





Next Story