రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైజెనిక్ కిట్స్ పంపిణీ

by Disha Web Desk 12 |
రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హైజెనిక్ కిట్స్ పంపిణీ
X

దిశ, మంచిర్యాల: రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్టేట్ రెడ్ క్రాస్ సహాయ సహకారాలతో జిల్లా కేంద్రంలోని చున్నంబట్టివాడ లోని ప్రభుత్వ ట్రైబల్ గర్ల్స్ ఆశ్రమములోని 100 మంది విద్యార్థినిలకు హైజెనిక్ కిట్స్ లు అందజేయడం జరిగింది. ఈ కిట్టు నందు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి రోజూ ఉపయోగించే పది రకముల వస్తువులు ఇందులో సమకూర్చడం జరిగింది. ఈ కిట్టు విద్యార్థినిలకు పూర్తి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సంస్థ ద్వారా దీనిని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ కె భాస్కర్ రెడ్డి, స్టేట్ ప్యాట్రన్ నెంబర్ వి మధుసూదన్ రెడ్డి, కోశాధికారి పడాల రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా డి జనార్దన్ డిటిడిఓఎం రాజమౌళి, ఏసీఎంవో ఆర్ సత్యనారాయణ, హెచ్ఎం మల్లారెడ్డి, డబ్ల్యు‌ఓ పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

Next Story

Most Viewed