- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో ‘రీసైకిల్డ్ వాటర్’ విప్లవం.. ఎస్టీపీల నుంచి నేరుగా పైపులైన్లు
హైదరాబాద్ ఎస్టీపీల నుంచి నేరుగా పైపులైన్ల ద్వారా నీటి సరఫరా! జలమండలికి రూ. 85 లక్షల ఆదాయం. 39 కొత్త ఎస్టీపీలతో మూసీ పునరుజ్జీవనం.

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్టీపీ (మురుగునీటి శుద్ధి కేంద్రం) నీటిని వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా శుద్ధి చేసిన నీటిని తోటపనికి, ఫ్లషింగ్ కోసం, చల్లబరచడానికి, పరిశ్రమల్లో ఉపయోగించొచ్చు. ఎస్టీపీ నీటిని విక్రయించడం ద్వారా జలమండలికి ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు. గతేడాది రూ.25 లక్షల ఆదాయం వస్తే ఈ సారి రూ.85 లక్షలకు పెంచినట్టు అధికారులు చెబుతున్నారు.
40 ఎస్టీపీలు
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలో జలమండలి ఆధ్వర్యంలో 40 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల(ఎస్టీపీ)ను నిర్వహిస్తున్నారు. వీటిలో 32 ఎస్టీపీల ద్వారా ముగురు నీటిని శుద్ధి చేస్తున్నారు. మరో 5 ఎస్టీపీలకు పనులు పూర్తి కావడంతోపాటు శుద్ధి పనులను ప్రారంభించాల్సి ఉంది. మరో మూడు ఎస్టీపీలకు సంబంధించిన పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే అంబర్‌పేట్ ఎస్టీపీ ద్వారా ప్రతి రోజూ 339 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసే అవకాశముంది.
మరో 39 ఎస్టీపీల నిర్మాణం
మూసీ పునరుజ్జీవనంలో భాగంగా కొత్తగా 39 ఎస్టీపీల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.3,849.10 కోట్లతో వ్యయంతో 972 ఎమ్మెల్డీల సామర్థ్యంతో కూడిన 39 ఎస్టీపీలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమీన్‌పూర్, తెల్లాపూర్, ఐక్రిసాట్, ఉష్కేబావి, బాచుగూడ, తిమక్క చెరువు, గాంధీ గూడెం, పీర్జాదిగూడ, నాగారం, నర్సింగ్ (ఓఆర్ఆర్), బాపూఘాట్, హైదర్‌షాహ్‌కోట, ఫతే నగర్, చిత్రాపురి కాలనీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, మీర్‌పేట్, మసాబ్ చెరువు, కాప్రా, రవిర్యాల్, బొంగులూరులో నిర్మాణ పనులు సాగుతున్నాయి.
పలు కంపెనీలతో ఒప్పందాలు
ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకోవడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా దుర్గం చెరువు ఎస్టీపీని నీటిని వినియోగించుకోవడానికి గోల్ఫ్ కోర్టు ముందుకు రావడంతో పాటు జలమండలి తో ఒప్పందం చేసుకుంది. పటేల్ చెరువు నీటిని వినియోగించుకోవడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు ముందుకొచ్చాయి. అత్తాపూర్ ఎస్టీపీ నీటిని వినియోగించుకోవడానికి మరో కంపెనీ ముందుకొచ్చింది. అయితే ఎస్టీపీ నుంచి కంపెనీ వరకు పైపులైన్ ద్వారా నీటిని అందించాలని కోరింది.
సదురు కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పైప్ లైన్ వేయడానికి జలమండలి అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు కుత్బుల్లాపూర్ పారిశ్రామికవాడలోని కంపెనీలు శివాలయనగర్ ఎస్టీపీ నీటిని వినియోగించుకోవడానికి ముందుకు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఆ ఎస్టీపీ సైతం పనిలోకి రావడం తో పాటు కంపెనీలకు శుద్ధి చేసిన నీటిని అందించనుంది. అయితే ఈ ఏడాదిలో మురుగు నీటిని శుద్ధి చేసిన తర్వాత వచ్చే నీటిని విక్రయించడం ద్వారా ఏడాదిలో సుమారు రూ.85 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీన్ని మరింత పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
ఓఆర్ఆర్ వెంట పైపులైన్
ఓఆర్ఆర్ పరిధిలోని గార్డెన్స్, మొక్కలు, ఇతర అవసరాలకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన వాటర్ వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్యాంకర్ల ఖర్చుతోపాటు బోర్లను ఎక్కువగా వినియోగించకుండా ఎస్టీపీ నీటిని వినియోగించుకోనున్నారు. ఈ నీటిని సరఫరా చేయడానికి ట్యాంకర్ల ద్వారా కాకుండా ఏకంగా పైపులైన్ వేయాలని జలమండలి నిర్ణయించింది. పైపులైన్‌కు సంబంధించిన డీపీఆర్ తయారు చేయాలని అధికారులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎస్టీపీ వద్ద ఫిల్లింగ్ స్టేషన్‌ను సైతం ఏర్పాటు చేయాలని జలమండలి నిర్ణయించింది.
ఎస్టీపీ లొకేషన్ -సామర్థ్యం
(ఎంఎల్డీ)
అంబర్‌పేట్- 339
నల్లచెరువు -30
పెద్దచెరువు -10
మిరాలం -10
మిరాలంసైట్ -2 5
ఎంఎంకుంట- 4
పటేల్ చెరువు- 2.50
సరూర్ నగర్- 2.50
లంగర్ హౌస్- 1.23
సఫిల్‌గూడ- 0.60
నాగోల్- 170
అత్తాపూర్- 51
లింగంకుంట -30
అత్తాపూర్ -23
ఖాజాకుంట -12
ఖాజాగూడ- 7
దుర్గంచెరువు- 5
గోపన్‌పల్లి- 4.50
నానక్ రాంగూడ- 4.50
జేవీఆర్ పార్కు -0.50
దుర్గంచెరువు -7
కోకాపేట్ -15
మిరాలంసైట్ -1 41.5
పెద్దచెరువు -17.50
నల్ల చెరువు-1 86.50
మియాపూర్ పటేల్- 7
సఫిల్‌గూడ- 5.5
ఖాజాకుంట- 20
ఫతేనగర్ -133
వెన్నెలగడ్డ - 10
నాగోల్ - 320
పాలపిట్టపార్కు - 7






