- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెదక్ రైతులకు ఊరట.. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తి
జిల్లాలో సంపూర్ణంగా వరి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

దిశ, మెదక్ ప్రతినిధి : జిల్లాలో సంపూర్ణంగా వరి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ధాన్యం కొనుగోళ్ల విజయవంతమైన నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ మెదక్ జిల్లా చరిత్రలోనే రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. సంపూర్ణంగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది యాసంగిలో గతంతో పోలిస్తే 1.08 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా రైతులు దిగుబడులు పండించారని, జిల్లాలో మొత్తం 4,28,361 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందన్నారు. రైతుల ఖాతాల్లో రూ.1,005.66 కోట్లు జమ చేశామన్నారు. 1,01,752 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించి, ఏప్రిల్ 8న ప్రారంభమైన ధాన్యం కొనుగోళ్లను జూన్ 27వ తేదీకి పూర్తి చేశామన్నారు. జిల్లాలో మొత్తం 533 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పీఏసీఎస్–305, ఐకేపీ–185, డీసీఎంఎస్–43 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు నిర్వహించామని చెప్పారు.
జొన్నలు కొనుగోలు చేస్తాం
జిల్లాలోని జొన్న రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, జొన్నల కొనుగోళ్లపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు. శుభ్రంగా ఉన్న జొన్నలను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 3,609 మంది రైతుల నుంచి 6,347 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానందం, సివిల్ సప్లై మేనేజర్ జగదీష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ రావు, డీపీఆర్‌ఓ రామచంద్ర రాజు పాల్గొన్నారు.






