- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రికార్డుస్థాయిలో తిరుమల శ్రీవారి దర్శనాలు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 2025-26 ఆర్థిక సంవత్సరంలో అనూహ్యంగా పెరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత రెండు సంవత్సరాలతో పోలిస్తే, 2025-26 ఏడాదిలో సగటు రోజువారీ దర్శనం సుమారు 73,000కు చేరుకుంది. ఇది గతంలో ఉన్న 70,000 సగటుతో పోలిస్తే 4.57% వృద్ధిగా టీటీడీ పేర్కొంది. ముఖ్యంగా పండుగలు, వారాంతపు సెలవు రోజుల్లో ఈ సంఖ్య 90,000 నుంచి 95,000 వరకు నమోదవ్వడం విశేషం. కేవలం మార్చి 2026 నెలలోనే సుమారు 22,27,988 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం, గత కాలపు రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ 2025లో జరిగిన వైకుంఠ ఏకాదశి సందర్భంగా, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 1.4 లక్షల మంది అదనంగా వైకుంఠ ద్వార దర్శనాన్ని పొందారు.
భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ ఆదాయం, సేవా కార్యక్రమాల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది. శ్రీవారి హుండీ ఆదాయం 13.95 కోట్ల రూపాయల మైలురాయిని అధిగమించగా, అన్నప్రసాద వితరణలో ఏకంగా 27% వృద్ధి కనబడింది. 2025-26 సంవత్సరంలో దాదాపు 33 లక్షల మందికి పైగా భక్తులకు అన్నదానం అందించడం ద్వారా టీటీడీ తన సేవా నిబద్ధతను చాటుకుంది. భక్తుల సంఖ్య ఇలా పెరగడానికి ప్రధాన కారణం.. టీటీడీ ప్రవేశపెట్టిన అధునాతన 'ఈ-డిప్' (e-dip) విధానం, సులభతరమైన ఆన్‌లైన్ దర్శన టికెట్ బుకింగ్, మెరుగైన క్యూ మేనేజ్‌మెంట్ వ్యవస్థలు అని చెప్పవచ్చు. అయితే భక్తుల సంఖ్య ఈ స్థాయిలో పెరగడం వల్ల కొన్ని రోజుల్లో దర్శనానికి వేచి ఉండే సమయం కూడా పెరుగుతోంది. రద్దీని అధిగమించేందుకు టీటీడీ ఇప్పుడు మౌలిక సదుపాయాల మెరుగుదల, భద్రతా ప్రమాణాల పెంపు, అన్నప్రసాద వితరణలో మరింత వేగాన్ని పెంచడంపై దృష్టి సారించింది.






