కాంగోలో రెబల్స్ మారణహోమం.. 70 మందికి పైగా సామాన్యుల మృతి

by Muthe.Rajitha |

మధ్య ఆఫ్రికాలోని కాంగోలో ఈశాన్య ప్రాంతాలపై రెబల్స్ దాడులు చేయడంతో 69 మంది సామాన్యులు మృతి చెందారు.

కాంగోలో రెబల్స్ మారణహోమం.. 70 మందికి పైగా సామాన్యుల మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఆఫ్రికా దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో హింస మరోసారి పడగ విప్పింది. ఈశాన్య ప్రాంతంలోని ఇటూరి ప్రావిన్స్‌లో 'కోడెకో' మిలిషియా గ్రూపు జరిపిన మెరుపు దాడుల్లో కనీసం 69 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 70 దాటవచ్చని స్థానిక అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ప్రతీకారమే కారణమా?

ఆ ప్రాంతంలోని ప్రత్యర్థి గ్రూపులకు వ్యతిరేకంగా 'కోడెకో' ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. ఇటూరి ప్రావిన్స్ బంగారు గనులకు ప్రసిద్ధి చెందడం వల్ల, ఈ వనరులపై పట్టు సాధించేందుకు వివిధ సాయుధ ముఠాల మధ్య దశాబ్దాలుగా పోరు సాగుతోంది. దాడులు జరిగిన ప్రాంతంలో భద్రత తక్కువ ఉండటం, రెబల్స్ సంచారం ఎక్కువగా ఉండటంతో, మృతదేహాలను వెలికితీయడానికి సమయం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. అయితే బంగారు గనుల దోపిడీయే లక్ష్యంగా సాగుతున్న ఈ జాతుల మధ్య ఘర్షణలు వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ ప్రాంతంలో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు ఉన్నప్పటికీ, మారుమూల గ్రామాల్లో సామాన్యులకు రక్షణ కరువైందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో ఇటూరి ప్రావిన్స్‌లో ప్రభుత్వం భారీగా సైనిక బలగాలను మోహరించింది.

Next Story